స్వతంత్ర దర్యాప్తు జరిపించండి.. కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టుకు టీవీకే

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-08 05:06:46  IST  )

కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్ట్రి కజగం (TVK) స్వతంత్ర దర్యాప్తు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

స్వతంత్ర దర్యాప్తు జరిపించండి.. కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టుకు టీవీకే
X

దిశ, వెబ్‌డెస్క్: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్ట్రి కజగం (TVK) స్వతంత్ర దర్యాప్తు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో 41 మంది మరణించగా.. మరో 60 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే, కేసులో దర్యాప్తును మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జరిపించాలని టీవీకే కోరింది. మద్రాస్ హైకోర్టు ఆదేశించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రా‌గార్గ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటును సవాలు చేస్తూ తాజాగా టీవీకే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పిటిషన్‌లో టీవీకే, హైకోర్టు రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన ఎస్ఐటీని ఏర్పాటు చేసినప్పటికీ, అంతకు ముందు పోలీసు దర్యాప్తు, అధికారుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తినట్లుగా వాదించింది. ఈ సిట్ ఏర్పాటు తమ పార్టీకి వ్యతిరేకమని, పక్షపాతంతో వ్యవహరిస్తోందని టీవీకే ఆరోపించింది.

Next Story