- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ ఆందోళన
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. "జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు మరణించడం పట్ల మేం ఆందోళన చెందుతున్నాం.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడిపై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేసింది. "జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు మరణించడం పట్ల మేం ఆందోళన చెందుతున్నాం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" అని పాక్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, ఈ భయంకరమైన దాడి వెనుక ఉన్న క్రూరమైన ప్రణాళికను వెలికితీసేందుకు భద్రతా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ఫొటోలను, స్కెచ్ లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురితో కూడిన స్కెచ్ ని, నలుగురు ఉన్న ఫొటోను విడుదల చేశాయి. అయితే, స్కెచ్ లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. వీరందరికీ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయని.. ఇద్దరు విదేశీయులు అని భావిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ ప్రభుత్వ స్పందన
పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) బాధిత కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా, ఈ దాడికి వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని పత్రికలన్నీ వినూత్న నిరసన తెలిపాయి. గ్రేట్ కశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ ఉజ్మా, అఫ్తాబ్, తైమీల్ ఇర్షద్ పేపర్స్ బ్లాక్ పేజీని ప్రచురించి నిరసన తెలిపాయి. బ్యాక్‌గ్రౌండ్ నలుపు రంగులో ఉండగా.. హెడ్‌లైన్స్, ఎడిటోరియల్స్ అన్నీ తెలుపు, ఎరుపు రంగులో ముద్రించారు. అలాగే ఈ ఘటనకు నిరసనగా పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు పలికాయి. కశ్మీర్‌లోయలో 35 ఏళ్లలో తొలిసారి ఈ స్థాయి మద్దతు లభించిందని అధికారులు తెలిపారు.






