రాహుల్‌గాంధీపై ఈసీకి ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

బీహార్ ఎన్నికల వేళ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని, ప్ర‌ధాని గౌర‌వాన్ని త‌గ్గించేలా మాట్లాడ‌టంపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

రాహుల్‌గాంధీపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఎన్నికల వేళ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని, ప్ర‌ధాని గౌర‌వాన్ని త‌గ్గించేలా మాట్లాడ‌టంపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి బేష‌ర‌తుగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని, ఆయ‌న ప్ర‌చారం చేయ‌కుండా నిషేధించాల‌ని కమిష‌న్‌ను అభ్యర్థించింది.

కాగా రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ... ఓట్ల కోసం ప్రధాని మోడీ ఎంత‌కైనా తెగిస్తార‌ని అన్నారు. ఆయ‌న 200 ఓట్ల కోసం వేదిక‌పై భ‌ర‌త‌నాట్యం కూడా చేస్తారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆయన మీ ఓటు మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నేతలు రాహుల్ గాంధీ గూండాలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story