Fraud: మరో వివాదంలో నటి శిల్పా శెట్టి దంపతులు.. వ్యాపారవేత్తను మోసం చేశారని కేసు నమోదు

by Ramesh Naini |   (  Updated:2025-08-14 08:08:12  IST  )

ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులు వివాదంలో చిక్కుకున్నారు.

Fraud: మరో వివాదంలో నటి శిల్పా శెట్టి దంపతులు.. వ్యాపారవేత్తను మోసం చేశారని కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ బాలీవుడ్ నటి (Shilpa Shetty) శిల్పా శెట్టి దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై కేసు నమోదు అయింది. పెట్టుబడి ఒప్పందాల వ్యవహారంలో రూ.60 కోట్లు మోసం చేశారని నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాల(Raj Kundra)పై దీపక్ కొఠారి (Deepak Kothari) అనే వ్యాపారవేత్త ఫిర్యాదుతో జుహు పోలీసులు కేసు నమోదు చేశారు. షాపింగ్ ఫ్లాట్ ఫాం బెస్ట్ డీల్ టీవీకి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో డబ్బులు ఇచ్చానని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఆరోపించారు. 2015-23 మధ్యలో వ్యాపారంలో భాగంగా రూ.60.48 కోట్లు ఇచ్చానని, 2016లో నటి శిల్పా శెట్టి తనకు హామీ కూడా ఇచిందని దీపక్ కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నారు. 87 శాతం వాటా కలిగి ఉన్న వారు కొన్ని నెలల తర్వాత శిల్పా శెట్టి తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా.. దీంతో షాపింగ్ ఫ్లాట్ ఫాం బెస్ట్ టీవీ కంపెనీ దివాలా తీసిందని తెలిపారు. మరోవైపు రాజీనామా విషయాన్ని బయట చెప్పలేదని, తన దగ్గర తీసుకున్న డబ్బులను వ్యక్తిగతంగా వాడుకున్నారని నటి శిల్పా శెట్టి దంపతులపై దీపక్ కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రూ. 10 కోట్లు దాటినందున ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW) కి అప్పగించినట్లు తెలిసింది. కాగా, గతంలో శిల్పా శెట్టి దంపతులపై మనీలాండరింగ్ చేశారనే ఆరోపణలతో ముంబైలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Also Read..

బ్లాక్ డ్రెస్సులో వైట్ స్కిన్ కనిపించేలా ప్రభాస్ బ్యూటీ బోల్డ్ షో.. సో సెక్సీ అంటూ కామెంట్స్

Next Story