సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ‘కోల్డ్‌వార్‌’.. స్పందించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే

by Ramesh Naini |

అంబర్‌నాథ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ కలిసి కూటమి ఏర్పాటు చేయడం తమ పార్టీ భావజాలానికి విరుద్ధమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే అన్నారు.

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ‘కోల్డ్‌వార్‌’.. స్పందించిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబర్‌నాథ్‌లో బీజేపీ-కాంగ్రెస్‌ కలిసి కూటమి ఏర్పాటు చేయడం తమ పార్టీ భావజాలానికి విరుద్ధమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్‌ శిండే అన్నారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో ఇప్పటికే మాట్లాడామని చెప్పారు. ‘అక్కడ జరుగుతున్నది భావజాలానికి అతీతం’ అని స్పష్టం చేశారు. గురువారం ఓ ప్రముఖ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. శివసేన బాలాసాహెబ్‌ ఠాక్రే సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని, అధికారాల కోసం ఎప్పుడూ ఆ సిద్ధాంతాలతో రాజీపడబోమని శిండే ఫైర్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని, మరికొన్ని చోట్ల స్థానిక పరిస్థితుల కారణంగా కూటమి కుదరలేదన్నారు. ఏం చేసినా అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేయం అని వ్యాఖ్యానించారు.

దేవేంద్ర ఫడ్నవిస్‌తో ‘కోల్డ్‌వార్‌’

విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేయడం తన స్వభావం కాదని, అంశాలపైనే మాట్లాడతానని చెప్పారు. వేర్వేరు చోట్ల వేర్వేరు కూటములు స్థానిక లెక్కలు, కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగానే నిర్ణయిస్తామని తెలిపారు. ఓవైసీ అంశంలోనూ బాలాసాహెబ్‌ సిద్ధాంతాలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్‌తో ‘కోల్డ్‌వార్‌’ అనే ప్రచారాన్ని కొట్టిపారేసిన శిండే, ఇద్దరం మంచి మిత్రులమని, రాష్ట్ర అభివృద్ధే ఉమ్మడి అజెండా అన్నారు. ముంబై మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమయం ఇవ్వాలని కోరారు.

Next Story