ఆరు నెలలుగా సహజీవనం.. చెత్త లారీలో మహిళ మృతదేహం.. అసలేం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-01 02:25:07  IST  )

ఒకవైపు నగరం రోజువారీ దినచర్యలతో గడుపుతుండగా.. మరోవైపు ఒక్కసారిగా భయాభ్రాంతులకు గురిచేసే సంఘటన వెలుగుచూసింది.

ఆరు నెలలుగా సహజీవనం.. చెత్త లారీలో మహిళ మృతదేహం.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఒకవైపు నగరం రోజువారీ దినచర్యలతో గడుపుతుండగా.. మరోవైపు ఒక్కసారిగా భయాభ్రాంతులకు గురిచేసే సంఘటన వెలుగుచూసింది. చెత్త తరలించే వాహనంలో మహిళ మృతదేహం కనిపించటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు (Bangalore) నగర పరిధిలోని చెన్నమ్మకెరె అచ్చుకట్టు ప్రాంతంలో ఆదివారం లభించిన గుర్తుతెలియన మహిళ (Women dead body) మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు.

మృతిచెందిన మహిళను పుష్ప అలియాస్ ఆశాగా (25)గా నిర్ధారించారు. ఆమె కొన్నాళ్లుగా శంశుద్దీన్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. శంశుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలను అసోంలోని సొంత ఊరిలో వదిలేసి, హుళిమాపు వద్ద ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే పుష్పతో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. అయితే, మద్యానికి అలవాటు పడిన ఆమె.. తరచూ ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జూన్ 28న కూడా ఇద్దరి మధ్య ఇదే విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశంలో ఆమెపై శంశుద్దీన్ దాడి చేసి గొంతుపిసికి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో కట్టి, ఆ మూటను బైక్‌పై తీసుకెళ్లి, హుళిమావు నుంచి సీకే అచ్చుకట్టు వైపు వెళ్లే పాలికె చెత్త లారీలో పడేసి పరారయ్యాడు. అయితే, అదే సమయంలో చెత్త వేసేందుకు వచ్చిన ఓవ్యక్తికి వాహనంలో నుంచి ఆమె తల కనిపించడంతో స్థానిక పోలీసుల సమాచారం ఇచ్చాడు. పోలీసులు వేగంగా స్పందించి ఆదివారం ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం నుంచి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వాటి ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారించారించగా, నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.

Next Story