జూన్ 6న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన.. పాల్గొననున్న సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్!

by Kema Shiva Kumar |

నీట్ (యూజీ) పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయాలని జూన్ 6న ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలకు పిలుపునిచ్చింది.

జూన్ 6న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన.. పాల్గొననున్న సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmedra Pradhan) రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే భారీ నిరసన ప్రదర్శనకు లడఖ్‌ (Ladakh)కు చెందిన ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) మద్దతు ప్రకటించారు. జూన్ 6న జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిర్వహించ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్, పరీక్ష రద్దు నిర్ణయం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు వీధిన పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు, పేపర్ లీకేజీల నివారణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ డిమాండ్ చేస్తోంది.

రంగంలోకి సోనమ్ వాంగ్‌చుక్..

అయితే, హస్తిన చేపట్టబోయే నిరసనను సమర్ధిస్తూ సోనమ్ వాంగ్‌చుక్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ ఆందోళనను నడిపిస్తున్న సామాజిక ప్రతినిధి అభిజీత్ దిప్కేను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రియమైన అభిజీత్.. జూన్ 6న జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో నేను కూడా మీతో భాగస్వామిని అవుతాను. దేశంలో నాణ్యమైన విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి, బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా మనమంతా నిలబడాలి’ అని వాంగ్‌చుక్ పేర్కొన్నారు. నిరసన కోసం అభిజీత్ దిప్కే ఇప్పటికే విదేశాల నుంచి భారత్‌కు తిరిగి రావడం విశేషం

Next Story