- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆందోళనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ.. కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్
నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిమాండ్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వరుస వైఫల్యాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే జూన్ 6న ఢిల్లీలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు, యువత రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా ఏకమై గళం వినిపిస్తే ప్రభుత్వం తప్పక దిగివస్తుందని ఆయన పేర్కొన్నారు.
కార్యాచరణ ఇలా.. జంతర్ మంతర్ వద్ద నిరసన
జూన్ 6వ తేదీ (శనివారం) ఉదయం అభిజీత్ డిప్కే ఢిల్లీకి చేరుకోనున్నారు. విమానాశ్రయం వద్దకు విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకోవాలని ఆయన కోరారు. అక్కడి నుంచి అందరూ కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా యువత సమస్యలపై పోరాడుతున్న ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖుల మద్దతును కూడగట్టుకుంటూ విశేష ఆదరణ పొందుతుండటం గమనార్హం.






