- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయ మహిళ నుంచి రూ.62.6 కోట్ల విలువైన కొకైన్‌ను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయ మహిళ నుంచి రూ.62.6 కోట్ల విలువైన కొకైన్‌ను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. జూలై 14న దోహా నుండి ముంబైకి వస్తున్న ఒక మహిళ మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుందని DRI ముంబై అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు DRI ముంబై అధికారులు సోమవారం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న మహిళా ప్రయాణికురాలిని అడ్డుకుని ఆమె లగేజీని క్షుణ్ణంగా పరిశీలించగా బిస్కెట్లు, చాక్లెట్లు లభ్యమయ్యాయి.
ఆరు ఓరియో బాక్సులు, మూడు చాక్లెట్ బాక్సులు ఓపెన్ చేసి చూడగా.. కొకైన్ తో నింపి ఉన్న గుళికలు లభ్యమయ్యాయి. మొత్తం 300 కొకైన్ గుళికలు ఉండగా వాటిని టెస్టుకు పంపి పరీక్షించారు. వాటిలో ఉన్నది కొకైనేనని, విలువ సుమారు రూ.62.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం 6261 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 నిబంధనల ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.






