CM's Wife : సీఎం భార్య వీడియో వైరల్..స్పోర్ట్స్ మీట్ లో సందడి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-22 08:21:59.0  )
CMs Wife : సీఎం భార్య వీడియో వైరల్..స్పోర్ట్స్ మీట్ లో సందడి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆమె ప్రముఖ నటి..అందులోనూ ఓ ముఖ్యమంత్రి సతీమణి. సోషల్ మీడియాకు అలాంటి సెలబ్రెటీ మహిళలు ఏం చేసినా అది వైరల్ వ్యవహారమే. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ముంబైలో జరిగిన ఓ మారథాన్ లో పాల్గొంది. ఇందుకోసం ఆమె స్పోర్ట్స్ డ్రెస్‌లో రావడంతో అందరు ఆమెను ఆశ్చర్యంగా..ఆసక్తిగా చూశారు. ఆమె అక్కడి నిర్వాహకులతో, మారథాన్ ఔత్సాహికులతో కలిసి సందడి చేశారు. మారధాన్ ను జెండా ఊపి ప్రారంభించిన అమృత ఫడ్నవిస్ నిర్వాహకులతో, పోలీసులతో మాట్లాడుతూ వారిలో ఒకరిగా వ్యవహరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. స్పోర్ట్స్ డ్రెస్ లో సందడి చేసిన సీఎం సతీమణి అమృత పడ్నవీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వయంగా ఆమె తను స్పోర్ట్స్ డ్రెస్ లో పాల్గొన్న కార్యక్రమం వీడియోను ఎక్స్ లో పోస్టు చేశారు.

కాగా సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ వేసుకున్న దుస్తులపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. మారధాన్ లో పాల్గొంటే అలాంటి డ్రెస్ వేసుకోవచ్చు కానీ.. ప్రారంభించడానికి అలాంటి బిగుతుగా ఉండే డ్రస్ తో రావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అమృత పడ్నవీస్ ప్లేబ్యాక్ సింగర్ గా, నటిగా, సామాజిక కార్యకర్త, సీనియర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ గా కూడా వివిధ రంగాల్లో తన నైపుణ్యాన్ని చాటారు. నాగ్‌పూర్, పూణేలలో కామర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ చదివిన అమృత పడ్నవీస్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంటారు. పలు ఫ్యాషన్ షోలలోనూ పాల్గొన్నారు. మహిళా సాధికారిత అంశంలో ఆమె గట్టిగా తన వాదన వినిపిస్తుంటారు.

Advertisement

Next Story