- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cm yogi: భారతీయ సంస్కృతికి ఆ నగరాలే ప్రతీక.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
ప్రయాగ్‌రాజ్, కాశీ, అయోధ్య నగరాలు భారతదేశ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్ (Prayag Raj), కాశీ (Kaashi), అయోధ్య (Ayodya) నగరాలు భారతదేశ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithya nath) అన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధ్యాత్మిక శ్రేయస్సును గౌరవం, గర్వంతో చూసుకోవడం వల్ల ఐక్యత, ఆర్థిక వృద్ధి రెండూ పెంపొందుతాయని తెలిపారు. సోమవారం ఆయన లక్నోలో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, అయోధ్య, కాశీ, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు భారతీయ సంస్కృతి పునరుజ్జీవనాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయంగా దోహదపడ్డాయని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు.
జనవరి 13 నుంచి 53 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని తెలిపారు. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, ఆర్థిక బలానికి నిదర్శనమని నొక్కి చెప్పారు. గత దశాబ్దంలో ప్రధాని మోడీ దేశ ఆధ్యాత్మిక వారసత్వ పునరుద్ధరణతో పాటు, దానితో ముడిపడి ఉన్న ప్రదేశాల ప్రాముఖ్యతను గుర్తించారన్నారు. ప్రత్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి బలమైన రాజకీయ సంకల్పమే కారణమన్నారు.






