ఘోర రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగీ

by Malleboina Mahesh |

మీర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు ఘోర రైలు ప్రమాదు చోటు చేసుకుంది.

ఘోర రైలు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగీ
X

దిశ, వెబ్ డెస్క్: మీర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు ఘోర రైలు ప్రమాదు చోటు చేసుకుంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా రైల్వే స్టేషన్ కు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రయాణికులు, ఒకటో ప్లాట్ ఫామ్ నుంచి నాలుగో ప్లాట్ ఫామ్ వెళ్లేందుకు పట్టాలపై దిగారు. పట్టాలు దాటుతుండగా.. నేతాజీ ఎక్స్‌ప్రెస్ (Netaji Express) రైలు ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగు మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సిఎం యోగి ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Next Story