- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీవీ షణ్ముగం, వేలుమణి కూడా ఉండగా.. పదవుల పంపకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మే4వ తేదీన అక్కడి ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వగా.. వారంరోజుల వరకూ కొత్త ప్రభుత్వం కొలువు దీరలేదు. మెజారిటీ మార్క్ 118 సీట్లు టీవీకే సాధించలేకపోవడం, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో జాప్యం.. ఒక్కసీటు తగ్గినా గవర్నర్ అనుమతి లేకపోవడం.. ఇలా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. ఎట్టకేలకు మే 10న విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక విజయ్ తన బలాన్ని నిరూపించుకోవడమే తరువాయి. మే 13 లోగా విజయ్ ఫ్లోర్ టెస్ట్ లో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో.. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడింది. సీనియర్ నేత సీవీ షణ్ముగం వర్గమంతా విజయ్ కు సపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. కీలక నేతలైన షణ్ముగం, వేలుమణి కూడా ఈ సమావేశంలో ఉన్నారు. మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల్లో ఎందరికి మంత్రి పదవులు ఇవ్వాలి? ఇతరత్రా కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీవీ షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు ఇచ్చిన షాక్ తో.. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామికి కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. పొత్తుల విషయంలో పళనిస్వామి మొండి వైఖరే ఆ పార్టీ చీలిపోయేందుకు ప్రధాన కారణమైందని బాహాటంగానే పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.






