Siddaramaiah : ఐదేళ్ల వరకు సీఎం నేనే.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-02 08:17:47  IST  )

సీఎం మార్పుపై సిద్ధ‌రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

Siddaramaiah : ఐదేళ్ల వరకు సీఎం నేనే.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం మార్పుపై సిద్ధ‌రామ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో సీఎం మార్పు జ‌ర‌గ‌బోతుంద‌ని జేడీఎస్, బీజేపీ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదేళ్లు తానే సీఎం అని మీకేమైనా అభ్యంత‌రం ఉందా అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉంటే డీకే శివ‌కుమార్ మ‌ద్ద‌తుదారుడు ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్య‌ల‌తో క‌ర్నాట‌క‌లో సీఎం మార్పు హాట్ టాపిక్‌గా మారింది. 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, సీఎం మార్పు డిమాండ్ హైకమాండ్ ముందు ఉంచుతామని ఇక్బాల్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హుస్సేన్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందించారు. ఎమ్మెల్యేలలో ఎలాంటి అసంతృప్తి లేదని అన్నారు. ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అంతే కాకుండా పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర ఎమ్మెల్యేలతోనూ తాను చర్చిస్తానని అన్నారు.

Next Story