దళితుడిని ప్రధానిగా ప్రకటించండి.. బీజేపీకి సిద్దరామయ్య సవాల్

by Phanindra |

పీఎం నరేంద్ర మోడీ రిటైర్ అయితే.. ఒక దళితుడిని ప్రధానిగా బీజేపీ ప్రకటించాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సవాల్ విసిరారు.

దళితుడిని ప్రధానిగా ప్రకటించండి.. బీజేపీకి సిద్దరామయ్య సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవలే 75 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులు రిటైర్ అయిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ‘ఆర్‌ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ 75 ఏళ్ల నరేంద్ర మోడీ రాజకీయ రిటైర్‌మెంట్‌పై హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక దళితుడిని ప్రధాని చేసే గోల్డెన్ ఛాన్స్ బీజేపీ వద్ద ఉంది. దీన్ని వాళ్లు ఉపయోగించుకోవాలి. ఇతరులకు లెక్చర్లు ఇచ్చే బదులు.. మీరే మార్పును ప్రారంభించొచ్చు. గోవింద్ కార్జోల్, చాలవాడి నారాయణస్వామి వంటి వారిని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ఎందుకు ప్రపోజ్ చేయడం లేదు? మీరు ఆ పని చేస్తే మిమ్మల్ని నేనే ముందుగా అభినందిస్తా’ అని సిద్దరామయ్య అన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర.. కాంగ్రెస్ నిజంగా దళితుల పక్షాన నిబడితే ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు.

Next Story