CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-07 06:12:55  IST  )

ముడా స్కామ్ (MUDA Scam) వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)కు భారీ ఊరట లభించింది.

CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ముడా స్కామ్ (MUDA Scam) వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah)కు భారీ ఊరట లభించింది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలని మైసూరు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ (Snehamai Krishna) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సంచలన తీర్పును వెలువరించింది. కాగా, లోకాయుక్త (Lokayuktha) ముడా స్కామ్‌లో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని, కాబట్టి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఇరు పక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎం.నాగప్రసన్న (Naga Prasanna) గత నెల 28న తీర్పు రిజర్వు చేశారు. విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది.

అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాది రాజకీయ ఒత్తిడితో దర్యాప్తు పక్కదారి పట్టించవచ్చని ఆరోపించారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు అనివార్యమని కోరారు. మరోవైపు సీఎం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) అన్ని కేసులను సీబీఐ (CBI)కి అప్పగించాలనడం సరికాదని కోర్టుకు తెలిపారు. ఇలా అయితే లోకాయుక్త పని చేయడం ఎందుకని వాదనలు వినిపించారు. లోకాయుక్త (Lokayuktha) పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారని అంటున్నారని, సీబీఐ కూడా కేంద్ర ప్రభుత్వ (Central Government) ఆధీనంలో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదని తెలిపారు. లోకాయుక్త దర్యాప్తు స్వతంత్రంగా ఉంటుందని కబిల్ సిబల్ (Kapil Sibal) వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.

Next Story