హస్తినలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

by Kema Shiva Kumar |

రాష్ట్రానికి భారీగా ఎత్తున స్వదేశీ, విదేశీ పెట్టుబడులను తీసురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు.

హస్తినలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఉదయం 11 గంటలకు న్యూజెర్సీ స్టేట్ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో భేటీ కానున్నారు. 11.30కి బిజినెస్ స్టాండర్డ్ వార్షిక ఫోరం సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కార్పొరేట్ దిగ్గజ సంస్థలైన అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఆ వెంటనే 12.30 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈఓ, నార్వే మాజీ మంత్రి బోర్జ్ బ్రెండేతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.

Next Story