కేరళంలో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-04 11:55:58  IST  )

కేర‌ళంలో యూడీఎఫ్ కూట‌మి విజ‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఇలాంటి అసాధార‌ణ‌మైన‌, క‌ఠోర‌మైన స్పూర్తిదాయ‌క‌ర‌మైన విజయం సాధించినందుకు నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌ను అభినిందించారు.

కేరళంలో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: కేర‌ళంలో యూడీఎఫ్ కూట‌మి విజ‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఇలాంటి అసాధార‌ణ‌మైన‌, క‌ఠోర‌మైన స్పూర్తిదాయ‌క‌ర‌మైన విజయం సాధించినందుకు నాయ‌కులకు, కార్య‌క‌ర్త‌ల‌ను అభినిందించారు. ఈ చారిత్రాత్మ‌క విజ‌యానికి నాయ‌క‌త్వం వ‌హించిన రాహుల్ గాంధీ, ఖ‌ర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షిల‌కు పార్టీ, కేడ‌ర్ తో క‌లిసి అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు. కేర‌ళ ప్ర‌చారం సంద‌ర్భంగా త‌న‌పై ప్రేమ కురిపించినందుకు గానూ యూడీఎఫ్ మ‌ద్ద‌తుదారుల‌కు, ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు.

తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌పున ఎల్ల‌ప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పేర్కొన్నారు. కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌జ‌లు ప్ర‌గ‌తిశీల విలువ‌లు, ప్ర‌జాస్వామ్య స్పూర్తి గ‌ల ప్ర‌జ‌ల‌ని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిని విశ్వ‌సిస్తాయ‌ని, ద‌శాబ్దంపాటు నిరాశ‌, ద్రోహం త‌ర‌వాత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో గొప్ప భ‌విష్య‌త్ అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కేర‌ళం ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. కేర‌ళలోని అధికార సీపీఎంపై విమ‌ర్శ‌లు కురిపిస్తూ ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. ఈ క్ర‌మంలో మాజీ సీఎం విజ‌యన్ సైతం రేవంత్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

Next Story