- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యం కోరిన సీఎం మమతా బెనర్జీ
సీఎం మమతా బెనర్జీ బెంగాల్‌లో జరుగుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం మమతా బెనర్జీ బెంగాల్‌లో జరుగుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యాన్ని కోరుతూ సీఈసీ గ్యానేశ్ కుమార్‌కు ఆమె లేఖ రాశారు. అందులో SIR ప్రక్రియను “అసంఘటితం, అస్తవ్యస్తం, ప్రజలకు ప్రమాదకరం గా అభివర్ణించారు. శిక్షణలో లోపాలు, అవసరమైన పత్రాలపై అస్పష్టత, ప్రజలు తమ ఉపాధి పనుల్లో ఉండటంతో వారికి చేరడం కష్టమవడం వంటి అంశాలు మొత్తం ప్రక్రియ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల సంఘానికి పంపిన వివరణాత్మక లేఖలో సీఎం మమతా బెనర్జీ ఈ రివిజన్ డ్రైవ్‌కు తగిన ప్రణాళిక, సన్నద్ధత, సమన్వయం లేకపోవడం వల్ల పరిస్థితి “చాలా ఆందోళనకర దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOs) ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, సర్వర్ సమస్యలు, తగిన శిక్షణ లేకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇది ఓటర్ల డేటా ఖచ్చితత్వాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నందున వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆమె కోరారు.






