ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై సీఎం అనుమానం.. రీ పోస్టుమార్టం కు ఆదేశాలు

by Malleboina Mahesh |

అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ రెండు రోజుల క్రితం సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై సీఎం అనుమానం.. రీ పోస్టుమార్టం కు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ (Singer Zubeen Garg) రెండు రోజుల క్రితం సింగపూర్‌లో ప్రాణాలు (Died in Singapore) కోల్పోయాడు. అయితే లైఫ్ జాకెట్ లేకుండా నీటిలో మునిగిపోవడం వల్లే ఆయన మృతిచెందినట్లు స్థానిక ప్రభుత్వం రిపోర్టు ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆ రిపోర్టుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో.. జుబిన్ గార్గ్ లైఫ్ జాకెట్ వేసుకుని నీటిలో దిగి ఈత కొట్టడం కనిపించింది. దీంతో ఆయన మృతిపై అభిమానులతో పాటు అధికారులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) కూడా సింగర్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.

జుబిన్ గార్గ్ మరణం సహజసిద్ధంగానే జరిగిందా, లేక అనుమానాస్పద పరిస్థితుల్లో చోటుచేసుకుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంబంధిత అధికారులను సంపూర్ణ విచారణ (thorough investigation) జరిపి వాస్తవాలను బయట పెట్టాలని ఆదేశించారు. అలాగే అవసరమైతే ఈ రోజు రీ పోస్టుమార్టం (Re Postmortem) నిర్వహించాలని, ఆయన మృతికి గల కారణాలు అభిమానులకు తెలియాలని, ఏదైనా కుట్రకోణం ఉంటే వారికి తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. అలాగే జుబిన్ గార్గ్ రాష్ట్ర ప్రజలకు ఒక గర్వకారణం మాత్రమే కాకుండా, అస్సాం సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి కావడంతో ఆయన మరణంపై తక్షణమే నిజానిజాలు బయటకు రావాలని ప్రజలు కోరుతున్నారని, అధికారుల నుంచి సమగ్ర నివేదిక వచ్చే వరకు ఈ సంఘటనపై అనుమానాలు కొనసాగుతాయని సీఎంతో పాటు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Next Story