రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ కేటాయింపులపై అమిత్ షాతో చర్చలు?

by Naga Rani Yarlagadda |

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ కేటాయింపులపై అమిత్ షాతో చర్చలు?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యి.. బడ్జెట్ లో రాష్ట్రానికి, రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి రానున్నట్లు సమాచారం.

దేశ చరిత్రలోనే తొలిసారి..

2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆరోజు ఆదివారం. సెలవురోజున పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుండటంతో.. ఈ బడ్జెట్లో సామాన్యులకు పన్ను రాయితీలు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. కొన్ని కీలక బిల్లులకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వరుసగా 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు.

Next Story