- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు.. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకమైన 'ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' పురస్కారానికి ఎంపికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రతిష్టాత్మకమైన 'ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఒక భారీ ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో సస్పెన్స్ రేకెత్తించిన మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh), చివరకు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక సంస్కరణలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అంతర్జాతీయ స్థాయి అవార్డు లభించిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
రాష్ట్రానికి గర్వకారణం
సీఎం చంద్రబాబుకు ఈ పురస్కారం దక్కడం తమ కుటుంబానికే కాకుండా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి లోకేశ్ తన పోస్ట్‌లో ఆనందం వ్యక్తం చేశారు. ఎకనామిక్ టైమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ అవార్డును ప్రకటించడం ద్వారా ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మరోసారి రుజువైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్త తెలియగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పారిశ్రామిక వర్గాలు ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నాయి.






