కోర్టు భవనం పైనుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ ఢిల్లీలోని సాకేత్ కోర్టు జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది.

కోర్టు భవనం పైనుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో ఒక ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ ఢిల్లీలోని సాకేత్ కోర్టు జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అతని చేతిపై వర్క్ ప్రెజర్ కారణంగానే తాను చనిపోతున్నట్లు రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన పేరు హరీష్ సింగ్ మహర్ అని, కొన్ని సంవత్సరాలుగా తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా తరచూ ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని తెలిపాడు. కానీ ఈ సమస్యలను ఎవరితోనూ పంచుకోలేకపోయానని రాశాడు. తనలో వచ్చిన ఆత్మహత్య ఆలోచనలను ఎవరితోనూ పంచుకోలేదని, వాటిని తానే అధిగమనిస్తానని నమ్మానన్నాడు. కానీ.. సూసైడ్ థాట్స్ ను బ్రేక్ చేయడంలో తాను ఫెయిల్ అయ్యాయని వాపోయాడు. తనకు 60 శాతం శారీరక వైకల్యం ఉందని, ఈ క్రమంలోనే ఆఫీసులో ఇచ్చే పనిని పూర్తిచేయడం కష్టంగా మారిందన్నాడు. వైకల్యానికి గురైనప్పటి నుంచి సరిగ్గా నిద్రపోలేకపోతున్నానని, ఓవర్ గా ఆలోచిస్తూ ఉండేవాడినని తెలిపాడు.

ఫైనాన్షియల్ ఇన్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ సమస్యల్ని కూడా ప్రస్తావించాడు. 60-70 ఏళ్ల వయసులో ఆత్మహత్యే శరణ్యంగా కనిపిస్తుందన్నాడు. తనలాగా వైకల్యం ఉన్నవారికి పనిచేసే ప్లేసుల్లో గౌరవాన్ని ఇవ్వాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా బాధపడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును అభ్యర్థించాడు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యలుకారని పేర్కొన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ ఆ ప్రాంతాన్ని సీజ్ చేసింది. కోర్టు కాంప్లెక్స్ లో ఆ సమయానికి ఉన్న సాక్షుల నుంచి పోలీసులు వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. హరీష్ సూసైడ్ నోట్ ఆధారంగా.. అతని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story