‌స్కూలుకు ఆలస్యంగా వచ్చిందని గుంజీలు తీయించిన టీచర్.. విద్యార్థిని మృతి

by Ajay Maddhiboyina |

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని 6వ తరగతి విద్యార్థినితో టీచర్ గుంజీలు తీయించగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన మహరాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పా

‌స్కూలుకు ఆలస్యంగా వచ్చిందని గుంజీలు తీయించిన టీచర్.. విద్యార్థిని మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని 6వ తరగతి విద్యార్థినితో టీచర్ గుంజీలు తీయించగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన మహరాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్ఘర్ లోని ఓ ప్రైవేటు స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న అన్షిక గౌడ్ అనే విద్యార్థినితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు క్లాస్‌కు ఆలస్యంగా వచ్చారు. దీంతో టీచర్ వారికి ఒక్కొక్కరు 100 గుంజీలు తీయాలని ఆదేశించింది.

అంతేకాకుండా వీపుపై స్కూల్ బ్యాగులు పెట్టుకునే గుంజీలు తీయాలని చెప్పింది. టీచర్ చెప్పినట్టుగా విద్యార్థులు గుంజీలు తీయగా అప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న అన్షిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. అదే రోజు రాత్రి తల్లి దండ్రులు ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థిని మరణించింది. దీంతో బాలికపట్ల అమానవీయంగా ప్రవర్తించిన స్కూల్ టీచర్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Next Story