- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోలీ రోజు పరీక్షకు హాజరు కాలేరా.. అయితే మీకో లక్కీ ఛాన్స్
హోలీకి సంబంధించి ఉత్తరాదిన మార్చి 13న పండుగ మొదలవగా.. దక్షిణాదిన మార్చి 14న పండుగను నిర్వహించనున్నారు.

- క్లాస్ 12 వాళ్ల కోసం ప్రత్యేక పరీక్ష
- ప్రకటించిన సీబీఎస్ఈ
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మార్చి 14న మరి కొన్ని రాష్ట్రాల్లో మార్చి 15న హోలీ పండుగ జరుగనున్నది. ఈ క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. క్లాస్ 12 కొరకు నిర్వహించనున్న హిందీ కోర్, హిందీ ఎలెక్టీవ్ ఎగ్జామ్స్ మార్చి 15న నిర్వహించాల్సి ఉండగా.. వీటి తేదీలను మార్పు చెసినట్లు చెప్పింది. మార్చి 15న పరీక్షకు హాజరు కావడానికి కష్టంగా ఉండే విద్యార్థులు ప్రత్యేక పరీక్ష నిర్వహించే రోజున రాయవచ్చని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేకంగా పరీక్షను నిర్వహిస్తారు. కానీ.. ఈ సారి హోలీ రోజు పరీక్షను రాయలేకపోతున్న విద్యార్థులకు ఈ నిబంధనను వర్తింప చేస్తున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించిన 2025 బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగనుంది. కాగా, హోలీకి సంబంధించి ఉత్తరాదిన మార్చి 13న పండుగ మొదలవగా.. దక్షిణాదిన మార్చి 14న పండుగను నిర్వహించనున్నారు.






