- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై పూజారుల గొడవ (వీడియో)
తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజారులు కొట్టుకోవడం ఏమిటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరిగింది. ఈ యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపై ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మరోవైపు చంపేస్తామని వార్నింగ్‌లు కూడా ఇచ్చుకున్నారు. తర్వాత భక్తులు, పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదానికి ముగింపు పలికింది.
తమిళనాడులో ఘోరంగా కొట్టుకున్న పూజారులు
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2024
కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది.కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. pic.twitter.com/iUXl1SNIvV






