- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indonesia: ఇండోనేషియాలో అల్లర్లు.. 20 మంది మృతి, మృతుల్లో పోలీసులు
ఇండోనేషియాలోని పపువా రీజియన్ లో చెలరేగిన అల్లర్లలో 20 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు ఉండగా.. మరో 18 మంది రెబల్స్ ఉన్నట్లు మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇవాన్ ద్వి ప్రిహర్టోనో తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని పపువా రీజియన్ లో చెలరేగిన అల్లర్లలో 20 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు పోలీస్ అధికారులు ఉండగా.. మరో 18 మంది రెబల్స్ ఉన్నట్లు మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇవాన్ ద్వి ప్రిహర్టోనో తెలిపారు. భద్రతా బలగాలు, వేర్పాటు వాదులకు మధ్య చెలరేగిన అల్లర్లలో ఈ దారుణం జరిగింది. తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న ఇంతన్ జయ ప్రాంతంలో విద్య, వైద్య సేవలు అందించేందుకు మిలటరీ దళాలు బుధవారం అక్కడకు వెళ్లగా రెబల్స్ ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారు.
వారి నుంచి రైఫిల్స్, తుపాకీలు, బాణాలతో పాటు తుపాకీ బుల్లెట్లను, వారికి చెందిన జెండాను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘర్షణలో ప్రభుత్వం తరపున ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. 1960ల్లో డచ్ కాలనీగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇండోనేషియా స్వాధీనం చేసుకుంది. 1969లో పపువాను ఇండోనేషియాలో విలీనం చేశారు. 1960 నాటి నుంచి పపువాలో తిరుగుబాటు ప్రారంభమవ్వగా.. నేటికీ అది కొనసాగుతోంది.






