- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంపై గడువు విధించే అంశంపై రానున్న స్పష్టత
గత కొంత కాలంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నర్ల మధ్య బిల్లుల ఆమోదం విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి, గవర్నర్ల మధ్య బిల్లుల ఆమోదం విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. గతంలో సుప్రీంకోర్టు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లు వారికి పంపిన తర్వాత మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు “ఆమోదించినట్టే” పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో రాజ్యాంగపరంగా గవర్నర్ల పాత్ర, వారి నిర్ణయాలకు ఉండే కాలపరిమితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉండడం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై చేసిన కఠిన వ్యాఖ్యలతో ఆయన దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గవర్నర్లు బిల్లులను నిలిపివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్యగా పిటిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాల్సిన గడువు, వారి అధికారం ఎంత వరకు విస్తరించి ఉందన్న అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ ఇవ్వబోయే స్పష్టతతో, దేశంలోని శాసన ప్రక్రియపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.






