- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీలకూ క్రీమీలేయర్ ఉండాలి.. సీజేఐ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
ఎస్సీలకూ క్రీమీలేయర్ ఉండాలని సీజేఐ గవాయ్ అన్నారు. తన వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలొచ్చాయని కూడా చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్ల విషయంలో ఐఏఎస్ అధికారి కుమారుడిని, రైతుకూలీ బిడ్డను సమానంగా చూడలేమని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో కూడా క్రీమీలేయరో ఉండాలని, ఈ విభాగంలోని వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఆయన చెప్పారు. ‘ఇండియా అండ్ లివింగ్ ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంద్ర సాహ్నీ కేసులో వచ్చిన తీర్పులో పేర్కొన్న క్రీమీలేయర్ విధానంపై నాకు ఒక అభిప్రాయం ఉంది. ఓబీసీల్లో ఉన్నట్లే ఎస్సీల రిజర్వేషన్లలో కూడా ఇలాంటి క్రీమీలేయర్ విధానం ఉండాలనేది నా భావన. ఈ విషయంలో నా జడ్జిమెంట్‌పై చాలా విమర్శలు కూడా వచ్చాయి’ అని గవాయ్ చెప్పుకొచ్చారు.
అయితే న్యాయమూర్తులు తమ తీర్పులకు వివరణ ఇవ్వకూడదని తను నమ్ముతానని, తన రిటైర్‌మెంట్‌కు మరో వారం రోజులు సమయం ఉందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో సమానత్వం, మహిళా సాధికారతపై దేశంలో చర్చ పెరిగిందని, అలాగే చరిత్రలో జరిగిన వివక్షపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై ఎప్పటి నుంచో మాట్లాడుతున్న సీజేఐ గవాయ్.. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని 2024లో పేర్కొన్నారు.






