- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు నేతలను కోర్టులో హాజరు పరచండి.. పౌరహక్కుల సంఘం డిమాండ్
చత్తీస్‌గఢ్ పోలీసుల (Chhattisgarh Police) అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులైన బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డిసి మెంబర్, మున్నా, సునీత, మహేష్‌తో పాటు మొత్తం పది మంది మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: చత్తీస్‌గఢ్ పోలీసుల (Chhattisgarh Police) అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులైన బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డిసి మెంబర్, మున్నా, సునీత, మహేష్‌తో పాటు మొత్తం పది మంది మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. వీరి ప్రాణాలకు పోలీసుల నుంచి హాని జరగకుండా చూడాలని కూడా సంఘం కోరింది. "కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్" (Coordination of Democratic Rights Organisations) అనే సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
గతంలో సీనియర్ నాయకులైన సుధాకర్, అడేలును ఛత్తీస్‌గఢ్ పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్‌లలో చంపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరు కూడా ఈ నాయకులతో పాటు చట్టవిరుద్ధంగా అదుపులో ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకటనలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) ప్రకారం ఈ నాయకుల ప్రాణాలను కాపాడాలని, వారికి చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ సదరు సంస్థ డిమాండ్ చేసింది. అలాగే సుధాకర్, అడేలు హత్యలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది. మావోయిస్టులపై జరుగుతున్న కఠిన సైనిక చర్యలను ఆపి, శాంతి చర్చలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది.






