ఇండిగో విమానం ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం: విమానయాన నియంత్రణ సంస్థ

by Vemula.Srinu Prasad |

ఇండిగో విమానానికి పాకిస్థాన్ గగన తలంలోకి కొద్దిసేపు అనుమతివ్వని సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని విమాన డైరెక్టరేట్ జనరల్ తెలపారు.

ఇండిగో విమానం ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం: విమానయాన నియంత్రణ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: తుఫానును తట్టుకోలేక కుదుపులకు లోనైన భారత ఇండిగో విమానానికి కొద్దిసేపు పాకిస్థాన్ గగన తలంలోకి అనుమతివ్వని సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని విమాన డైరెక్టరేట్ జనరల్ తెలపారు. అప్పటి వరకూ ఆ దేశంలోకి వెళ్లొద్దని తెలిపారు. 2 రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటన మొత్తం భారత దేశాన్ని షాకింగ్‌కు గురి చేసింది. ఢిల్లీ నుంచి 220 మంది ప్రయాణికులతో శ్రీనగర్ కు బయల్దేరిన ఇండిగో విమానం.. తుపాను కారణంతో గగతలంలో అతలాకుతలం చేసింది. దీంతో తుపాను నుంచి దూరంగా వెళ్లేందుకు కాసేపు పాకిస్తాన్ గగనతంలోకి అనుమతివ్వాలని ఇండిగో పైలట్.. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు. అయితే ఈ అభ్యర్థనను పాకిస్థాన్ ఏటీసీ అధికారులు తిరస్కరించారు. దీంతో పైలట్ సాహసం చేసి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో విమానం ముందు భాగం కొంత ధ్వంసం అయింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో గగనతలంలోకి అనుమతించని పాకిస్థాన్ నిర్ణయాన్ని భారత విమాన డైరెక్టరేట్ జనరల్ తప్పుబట్టారు. ప్రమాదం జరిగి ఉంటే చాలా ప్రాణ నష్టం జరిగేదని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.

Next Story