- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలోకి మరో రెండు విమానయాన సంస్థలు.. NOC ఇచ్చిన పౌర విమానయాన శాఖ
దేశ పౌర విమానయాన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ పౌర విమానయాన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఈ మేరకు కేంద్రం మరో రెండు కొత్త విమానయాన సంస్థలైన అల్ హింద్ ఎయిర్ (Al Hind Air), ఫ్లైఎక్స్‌ప్రెస్ (ఫ్లై Express)కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCs) జారీ చేసింది. దీంతో 2026లో ఆ రెండు ఎయిర్‌లైన్స్ సంస్థలు వాణిజ్య విమానాల కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ప్రకటించారు. గత వారంలో ఆయన మూడు కొత్త విమానయాన సంస్థలైన శంఖ్ ఎయిర్ (Shankh Air), అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ బృందాలతో సమావేశమైనట్లుగా పేర్కొన్నారు. శంఖ్ ఎయిర్‌కు ఇంతకు ముందే NOC లభించగా, అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలకు NOCలు జారీ చేసినట్లుగా వెల్లడించారు.
కాగా, కేరళ ఆధారిత అల్‌హింద్ గ్రూప్ దక్షిణ భారత రూట్లపై దృష్టి సారించి మొదట ATR-72 టర్బోప్రాప్ విమానాలతో ప్రాంతీయ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అనంతరం క్రమక్రమంగా అంతర్జాతీయ సేవలు విస్తరించే అవకాశం ఉంది. ఇక మరో విమానయాన సంస్థ ఫ్లైఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ ఆధారిత అంతర్జాతీయ, దేశీయ కొరియర్, కార్గో సేవల కంపెనీతో కలిసి పనిచేస్తోంది. విమానాలు, రూట్లు వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేవు. ఈ సంస్థలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (AOC) పొందాల్సి ఉంది. ఆ తర్వాతే వాణిజ్య విమానాలను నడిపే అర్హత లభిస్తుంది.






