"మిస్టర్ ఇండియా"గా CISF జవాన్

by Muthe.Rajitha |

ఇండియన్ ఆర్మీకి చెందిన మిస్టర్ ఇండియా టైటిల్ సాధించాడు.

మిస్టర్ ఇండియాగా CISF జవాన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ఆర్మీకి చెందిన మిస్టర్ ఇండియా టైటిల్ సాధించాడు. CISF విభాగానికి చెందిన ఓ యాభై ఏళ్ల జవాన్ ఈ ఘనత సాధించడం.. తమకు గర్వకారణం అంటూ ఆర్మీ కొనియాడింది. రాజస్తాన్ లోని జైపూర్ లో జరిగిన 6వ మిస్టర్ ఇండియా 2025 ఛాంపియన్ షిప్ టైటిల్ ను CISF విభాగానికి చెందిన కానిస్టేబుల్ రిషిపాల్ సింగ్ సాధించాడు. మిస్టర్ ఇండియా టైటిల్ తోపాటు.. 50+ ఏజ్, 65 - 70 కేజీల బాడీ బిల్డింగ్ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.

ఈ రిషిపాల్ సింగ్ మాట్లాడుతూ.. తన ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని, ఈ విజయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోపాటు.. అధికారుల తోడ్పాటు మరువలేనిది అన్నారు. రిషిపాల్ సింగ్ సాధించిన విజయం ఆర్మీ క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనం అని.. రిషిపాల్ విజయం CISF కీర్తిని చాటుతుందని అధికారులు పేర్కొన్నారు.

Next Story