China: అమెరికాపై చివరి వరకు పోరాడతాం.. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఫైర్

by B.Srinivas |

చైనా దిగుమతులపై అదనంగా 50 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది.

China: అమెరికాపై చివరి వరకు పోరాడతాం.. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా దిగుమతులపై అదనంగా 50 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలపై చైనా (China) తీవ్రంగా స్పందించింది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు (Tarrifs) పూర్తిగా నిరాధారమైనవని, ఇది రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపింది. యూఎస్ తన ఇష్టానుసారం నడుచుకోవాలని పట్టుబడితే తమ దేశ ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘చైనా వస్తువులపై టారిఫ్స్ పెంచుతామని ట్రంప్ తెలిపారు. దీంతో అమెరికా బ్లాక్ మెయిలింగ్ ప్రవర్తన మరోసారి బయటపడింది. దీనిని చైనా ఎప్పటికీ అంగీకరించబోదు. పరస్పర సుంకాలను బదులుగానే అమెరికా వస్తువులపై 34 శాతం సుంకాలు విధించాం. అమెరికా తన తీరును ఇలాగే కొనసాగిస్తే చివరి వరకు పోరాడతాం’ అని పేర్కొంది.

కాగా, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అమెరికాలోకి దిగుమతి చేసుకునే చైనా వస్తువులపై 34 శాతం సుంకాలు ప్రకటించారు. అనంతరం చైనా సైతం ప్రతీకారం సుంకాలు విధిస్తున్నట్టు తెలిపింది. దీంతో చైనా తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, లేదంటే అదనంగా ఆ దేశంపై 50 శాతం అదనపు సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం (Trade war) ముదిరినట్టు కనిపిస్తోంది.

Next Story