- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో సరిహద్దు సమస్యపై చర్చించేందుకు సిద్ధం: చైనా
భారత్‌తో సరిహద్దు సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా తెలిపింది. సరిహద్దును నిర్ధారించేందుకు చర్చలు జరగుతాయని వెల్లడించింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో ఉన్న సరిహద్దు సమస్య చాలా ‘కాంప్లికేటేడ్’ అని, దాన్ని పరిష్కరించడానికి చాలా టైం పడుతుందని చైనా పేర్కొంది. అయితే సరిహద్దును నిర్ణయించేందుకు, బోర్డర్ ప్రాంతాల్లో శాంతిని మెయింటైన్ చేయడానికి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశం కోసం చైనా వెళ్లిన సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ ఇటీవలే సమావేశమైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగానే సరిహద్దు సమస్యల పరిష్కారం దిశగా ఇరుదేశాలు అడుగులు వేయాలని రాజ్‌నాథ్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే విషయం చెప్పిన చైనా విదేశాంగ శాఖ.. ఇప్పటికే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, అలాగే సరిహద్దు సెటిల్‌మెంట్ కోసం రాజకీయ పరిమితిలు, మార్గదర్శకాలకు ఇరుదేశాలు అంగీకారం తెలిపాయని వెల్లడించింది. అయితే సరిహద్దును నిర్ధారించడం కొంత క్లిష్టమైన వ్యవహారమని, కాబట్టి దీనికి కొంత టైం పడుతుందని తెలిపింది.






