- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China: తగ్గనంటున్న చైనా.. అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్
అమెరికా అనుసరిస్తున్న విధానం ఒక నంబర్ గేమ్ అని, ఆర్థికంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని చైనా అభిప్రాయపడింది

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, చైనా దేశాలు పరస్పరం సుంకాలు పెంచుతూ ప్రపంచ వాణిజ్యంలో ఆజ్యం పోస్తున్నాయి. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయానికి బేఖాతరు చేయకపోవడమేంటని చైనా ఉత్పత్తులపై ఏకంగా 145 శాతానికి టారిఫ్‌లను పెంచారు. ఇందుకు బదులిచ్చిన చైనా, తమతో ఇలాంటి బెదిరింపు ధోరణి పనిచేయదంటూ ఎదురు 125 శాతానికి సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 12(శనివారం) నుంచి ఈ పెంపు అమలవుతుందని శుక్రవారం ప్రకటనలో ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిణామంతో రెండు అగ్రశ్రేణి ఆర్థికవ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అమెరికా అనుసరిస్తున్న విధానం ఒక నంబర్ గేమ్ అని, ఆర్థికంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని చైనా అభిప్రాయపడింది. చైనా ఉత్పత్తులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా ఆలోచించాలని సూచించింది. ఇదే సమయంలో, అమెరికా విధించే టారిఫ్‌లను పట్టించుకునేది లేదని చైనా పేర్కొంది. చైనాతో ఒప్పందానికి బెదిరింపులు, ఒత్తిళ్లు సరైన మరగం కాదని, పరస్పర గౌరవంపై ఆధారంగానే చర్చలు జరగాలని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి యాంగ్ కియాన్ చెప్పారు.
అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల వల్ల ప్రపంచ ఆర్థిక కల్లోలం ఏర్పడితే అందుకు అమెరికా 'పూర్తి బాధ్యత వహించాలి' అని చైనా స్పష్టం చేసింది. టారిఫ్ విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా దావా వేయనున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటునాయి. అమెరికా విధించే సుంకాల వల్ల చైనా ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని, అమెరికాకు ఉత్పత్తులను ఎగుమతి చేసే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.






