- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
China: అఫ్గానిస్థాన్ లో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్
అఫ్గానిస్థాన్ లో చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) విస్తరించనుంది. సిపెక్ ని విస్తరించాలని బీజింగ్ లో ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గానిస్థాన్ లో చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) విస్తరించనుంది. సిపెక్ ని విస్తరించాలని బీజింగ్ లో ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై పాక్ ఉపప్రధాని ఇస్సాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీలు చర్చలు జరిపారు. కాగా.. ప్రస్తుతం పాక్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇస్సాక్ దార్ మూడ్రోజులపాటు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. ‘‘పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్‌లు ప్రాంతీయ శాంతి, సుస్థిరత అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి వంటివే కీలకమైనవి. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ను అఫ్గానిస్థాన్ వరకు పొడిగించేందుకు అంగీకరించారు’’ అని దార్ సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. ఇకపోతే, ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో మరో సమావేశాన్ని కాబుల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
చైనాకు కీలకంగా సిపెక్
చైనా నుంచి పాక్ బలూచిస్థాన్ లోని గ్వదర్ వరకు సాగే సిపెక్ చాలా కీలకమైంది. ఇక్కడే, చైనా షిప్స్ పర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సిపెక్‌లో భాగంగా గ్వదర్ పోర్టు నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చైనా నౌకలు మలక్కా జలసంధిపై ఆధారపడటం తగ్గిపోతుంది. మరోవైపు 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన సిపెక్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కూడా ఉండటం దీనికి ప్రధాన కారణం.






