- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నిజమే.. కానీ’.. ఆపరేషన్ సిందూర్ టైంలో పాక్‌కు సహకారంపై చైనా క్లారిటీ
ఆపరేషన్ సిందూర్ టైంలో పాక్‌కు సహకారం అందించడంపై చైనా క్లారిటీ ఇచ్చింది. సహకారం మాట వాస్తవమేనని, అయితే భారత్‌కు తాము వ్యతిరేకం కాదని చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకారం అందించిందని భారత ఆర్మీకి చెందిన టాప్ అఫీషియల్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలపై చైనాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. చైనా-పాకిస్తాన్ ఫ్రెండ్లీ దేశాలని, కాబట్టి డిఫెన్స్, సెక్యూరిటీ రంగాల్లో సహకారం చాలా సాధారణమని బీజింగ్ చెప్పుకొచ్చింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి సమాచారం లేదని, అయితే పాక్‌కు తమ సహకారం ఏ దేశానికీ వ్యతిరేకంగా జరగలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిందామె.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్, పాక్ మధ్య పరిస్థితులను చైనా చాలా జాగ్రత్తగా పరిశీలించిందని, ఇరుదేశాలు చర్చలు జరపాలని కోరిందని, ప్రాదేశిక శాంతి కోసం ప్రయత్నించిందని నింగ్ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు మధ్యవర్తి్త్వం వహించేందుకు చైనా సిద్ధంగా ఉందని చెప్పారు. అదే సమయంలో భారత్-చైనా సంబంధాలు కూడా కీలకమైన దశలో ఉన్నాయని, వీటిని మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు.






