ఇరాన్‌పై దాడులు కరెక్ట్ కాదు.. ఖండించిన చైనా, రష్యా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-01 11:27:52  IST  )

ఇరాన్‌పై ఇజ్రాయిల్-యూఎస్ చేస్తున్న దాడులపై చైనా, రష్యా స్పందించాయి. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని తెలిపాయి. ..

ఇరాన్‌పై దాడులు కరెక్ట్ కాదు.. ఖండించిన చైనా, రష్యా
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌(Iran)పై ఇజ్రాయిల్-యూఎస్(Israel-US) చేస్తున్న దాడులపై చైనా(China), రష్యా(Rashya) స్పందించాయి. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని తెలిపాయి. చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్‌పై దాడులు చేయడం సరికాదంటూ ఖండించాయి. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించడమేనని. ఐక్యరాజ్య సమితి సూత్రాలను తుంగలో తొక్కారని చైనా అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్‌లో పాలనను మార్చాలనుకోవడం సరికాదంది. దాడులను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేసింది. చర్చలకు తిరిగి రావాలని తాము కోరుతున్నామని చైనా పిలుపునిచ్చింది.

మరోవైపు ఇజ్రాయిల్- యూఎస్‌పై ఇరాన్ సైతం భీకర దాడులు చేస్తోంది. అటు గల్ఫ్ కంట్రీస్‌పైనా దాడులు చేస్తోంది. ప్రస్తుతం యూకేలోని స్పైప్రస్‌పై మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడిని యూకే అధికారికంగా ధృవీకరించింది

Next Story