మైనర్ బాలుడిపై 13మంది లైంగిక వేధింపులు.. వీడియో తీసి.. 24సార్లు కత్తితో పొడిచి.. ఆ తర్వాత

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-26 15:31:45  IST  )

ఔటర్ నార్త్ ఢిల్లీలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ వీడియో తీసిన 13 మంది.. 24 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. ఆ తర్వాత బాడీని మునక్ కాలువలో పడేశాడు. జూన్ 29న ఈ ఘటన జరగ్గా..

మైనర్ బాలుడిపై 13మంది లైంగిక వేధింపులు.. వీడియో తీసి.. 24సార్లు కత్తితో పొడిచి.. ఆ తర్వాత
X

దిశ, వెబ్ డెస్క్ : ఔటర్ నార్త్ ఢిల్లీలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ వీడియో తీసిన 13 మంది.. 24 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. ఆ తర్వాత బాడీని మునక్ కాలువలో పడేశాడు. జూన్ 29న ఈ ఘటన జరగ్గా.. జూలై 1న శవం కాలువలో గుర్తించబడింది. అయితే ఈ ఘటనలో పోస్టుమార్టం రిపోర్ట్‌ ద్వారా చిల్లింగ్ ట్రుత్స్ బయటకొచ్చాయి. చనిపోయిన బాలుడు ప్రత్యర్థి గ్యాంగ్‌కు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడనే అనుమానంతో హత్య చేసినట్లు తేలింది.

పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. బాలుడిపై 24 కత్తి పోట్లు.. అతని ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన గాయాలు గుర్తించబడ్డాయి. ఇది లైంగిక వేధింపులను సూచిస్తుంది. పది మంది నిందితులు ఇప్పటికే అరెస్ట్ కాగా.. ముగ్గురిని మీరట్‌లోని కన్వరియన్స్ క్యాంప్‌లో మారువేషంలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. రికార్డింగ్ వీడియో ఉన్న ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్య, ఆధారాలను నాశనం చేయడం కింద కేసు నమోదు కాగా.. POCSO చట్టం సెక్షన్ 6 కింద తీవ్రమైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

Next Story