పామును కొరికి చంపిన చిన్నారి..తరవాత ఏం జరిగిందంటే

by Ajay Maddhiboyina |

బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో చంపార‌న్ జిల్లా బేతియాలో ఏడాది వ‌య‌సున్న చిన్నారి గోవింద‌ పామును కొరికి చంపేశాడు.

పామును కొరికి చంపిన చిన్నారి..తరవాత ఏం జరిగిందంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలో చంపార‌న్ జిల్లా బేతియాలో ఏడాది వ‌య‌సున్న చిన్నారి గోవింద‌ పామును కొరికి చంపేశాడు. గోవింద‌ ఇంటిమందు ఆడుకుంటూ ఉండ‌గా అత‌డి వ‌ద్ద‌కు కోబ్రా వ‌చ్చింది. అది అత‌డి చేతివ‌ద్ద‌కు రాగా దానిని తీసుకుని నోటితో కొర‌క‌డంతో రెండు ముక్క‌లై అక్క‌డిక్క‌డే చ‌నిపోయింది. కొద్దిసేప‌టికి చిన్నారిని చూసిన త‌ల్లిదండ్రులు ఆశ్చ‌ర్య‌పోయారు. బాబుకు ఏమీ కాక‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ పామును చంపిన త‌ర‌వాత కొన్ని గంట‌ల‌కు చిన్నారి స్పృహ త‌ప్పిప‌డిపోయాడు. దీంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు స్థానిక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డ నుండి బేతియాలోని మెడిక‌ల్ కాలేజీకి రిఫ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం చిన్నారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తుండగా కోలుకుంటున్న‌ట్టు వైద్యులు చెబుతున్నారు.

Next Story