- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balloon explosion: బెలూన్ పేలి.. 8 ఏళ్ల చిన్నారి మృతి.. మహారాష్ట్రాలో విషాద ఘటన
ఎలాంటి వేడుకలు అయిన రంగురంగుల బెలూన్స్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలాంటి వేడుకలు అయిన రంగురంగుల బెలూన్స్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం. ముఖ్యంగా చిన్న పిల్లలు బెలూన్‌తో ఎంతో సరదాగా ఆడుకుంటారు. అయితే గాలి ఊదేసమయంలో పగిలినప్పుడు వచ్చే శబ్దం వింటే పెద్దవారైన ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా (Maharashtra) మహారాష్ట్రాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెలూన్ పేలి (balloon explosion) చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. ధులే నగరంలోని యశ్వంత్ నగర్‌లో డింపుల్ మనోహర్ వాంఖడే (8) అనే బాలిక బెలూన్ నోట్లో పేలిపోవడం వల్ల మరణించింది. ఇంటి ఆవరణలో తోటి పిల్లలతో కలిసి బెలూన్‌లో నోటితో ఊదుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదట పేలిన బెలూన్ ముక్కలు గొంతులో ఇరుక్కుపోవడంతో చిన్నారి డింపుల్ స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తోటి పిల్లలు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ క్రమంలోనే హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. బెలూన్ ముక్కలు ఆమె శ్వాస నాళం వద్ద ఇరుక్కుపోవడంతో చిన్నారికి ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.






