ముఖ్యమంత్రికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-21 08:20:06  IST  )

రాష్ట్రంలో అసెంబ్లీ (Assembly) ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా కాస్త ఇబ్బంది పడినట్లుగా వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అదేవిధంగా తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుందని స్టాలిన్‌ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో (Apollo) ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్టాలిన్‌కు వైద్యులు రెగ్యూలర్ మెడికల్ టెస్ట్‌లు చేస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఆయన ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోబోతున్నట్లుగా ఆపోలో ఆసపత్రి హెల్త్ బులిటిన్ విడుదల చేసింది.

Next Story