కోడ్ వర్డ్స్‌తో మతమార్పిడి గ్యాంగ్.. ఛంగూర్ బాబాకు 18 బ్యాంకు ఖాతాలు!

by Phanindra |

యూపీలో అరెస్టయిన ఛంగూర్ బాబా.. తన మోడస్ ఓపరాండీని విచారణలో వెల్లడించారు. కోడ్ వర్డ్స్‌తో మతమార్పిడి గ్యాంగ్ నడిపినట్లు తెలిపారు.

కోడ్ వర్డ్స్‌తో మతమార్పిడి గ్యాంగ్.. ఛంగూర్ బాబాకు 18 బ్యాంకు ఖాతాలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల అరెస్టయిన ఛంగూర్ బాబా.. మతమార్పిడులకు ఎలాంటి పథకాలు వేసేవాడో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) వెల్లడించింది. ఎక్కువగా అమ్మాయిలను టార్గెట్ చేసిన ఈ బాబా.. వారిని ‘ప్రాజెక్ట్’ అని పిలిచేవాడని ఎస్‌టీఎఫ్ తెలిపింది. మత మార్పిడిని ‘మిట్టీ పలట్‌నా’, మాయమాటలు చెప్పి మోసం చేయడాన్ని ‘కాజల్ లగానా’, చివరకు తనను కలవడాన్ని ‘దర్శన్’ అని ఛంగూర్ బాబా, అతని గ్యాంగ్ పిలిచేవారట.

తను చేస్తున్న పనిపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే అతను ఇలాంటి కోడ్ వర్డ్స్ ఉపయోగించేవాడని తెలుస్తోంది. యువతీయువకు మాయమాటలు చెప్పి తన గ్యాంగ్ వల వేసేదని, ఆ తర్వాత డబ్బులు, విదేశీ ట్రిప్‌లు, ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు వంటి ఆశలు చూపించి వారి మతం మార్పించేవారిమని విచారణలో ఛంగూర్ బాబా వెల్లడించారు. అతనికి సంబంధించి మొత్తం 18 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఈ ఖాతాల్లో రూ.68 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని, గడిచిన మూడు నెలల్లో ఏడు కోట్లు జమ అయ్యాయని ఈడీ వెల్లడించింది. ఈ డబ్బుతోనే ఛంగూర్ బాబా తన మతమార్పిడి కార్యకలాపాలను చేస్తుండేవాడని సమాచారం.

Next Story