అమ్మకిచ్చిన మాటకోసం 150 డిగ్రీలు చేసిన ప్రొఫెసర్.. టార్గెట్ అదే

by Naga Rani Yarlagadda |

తల్లికి ఇచ్చిన మాటకోసం 1981 నుంచి ఆయన డిగ్రీలు చదువుతూనే ఉన్నారు. నిజానికి చదవడాన్ని తాను చాలా ఆస్వాదిస్తానని, ఇప్పటి వరకూ 150 డిగ్రీలు చేశానని తెలిపారు.

అమ్మకిచ్చిన మాటకోసం 150 డిగ్రీలు చేసిన ప్రొఫెసర్.. టార్గెట్ అదే
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బు, స్థిరాస్తి రూపాల్లో సంపాదించి ఇచ్చే ఆస్తులకంటే.. విద్యను అందించగలగడమే నిజమైన ఆస్తి అని వింటుంటాం. చదువు ఉంటే.. ఎలా అయినా బ్రతకగలిగే ధైర్యం ఉంటుందంటారు. అయితే ఈ రోజుల్లో ఒక్క డిగ్రీ పాసవ్వడమే స్టూడెంట్స్ కు చాలా కష్టమైపోయింది. దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా. కానీ ఒక ప్రొఫెసర్ మాత్రం తన తల్లికి ఇచ్చిన మాటకోసం ఏకంగా 150 డిగ్రీలు చేశారు.

చెన్నైకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పార్థిబన్ తొలిసారి డిగ్రీ పాసైనపుడు చాలా తక్కువ మార్కులు రావడంతో తన తల్లి బాధపడ్డారంట. దాంతో నెక్స్ట్ టైమ్ టాప్ మార్కులు తెచ్చుకుంటానని వాగ్ధానం చేశారట. తల్లికి ఇచ్చిన మాటకోసం 1981 నుంచి ఆయన డిగ్రీలు చదువుతూనే ఉన్నారు. నిజానికి చదవడాన్ని తాను చాలా ఆస్వాదిస్తానని, ఇప్పటి వరకూ 150 డిగ్రీలు చేశానని తెలిపారు. త్వరలో 200 డిగ్రీలు చేయడమే తన లక్ష్యమని ప్రొఫెసర్ పార్థిబన్ తెలిపారు. ఆయన చేసిన డిగ్రీలు, పీజీ కోర్సుల్లో ఎంఏ, MPhil, MSc, M.com, MCS, PG, PhD, CMA వంటి కోర్సులున్నాయి. చెన్నైలోని RKM వివేకానంద కాలేజీలో ఆయన కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పార్థిబన్ సంపాదనలో 90 శాతం కాలేజీ ఫీజులు, బుక్స్, ఎగ్జామ్ ఫీజులు కట్టేందుకే ఖర్చు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన చేసిన డిగ్రీల గురించి తెలిసిన వారంతా డిగ్రీల రిపోజిటరీ, వాకింగ్ ఎన్ సైక్లోపీడియా అని పిలుస్తుంటారు. ఇక పార్థిబన్ సీవీ చూసిన వారికి ఎవరికైనా ఒక చిన్నపాటి యూనివర్సిటీలో ఉండే కోర్సుల లిస్టే కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ 13 (MA), 8 మాస్టర్స్ ఆఫ్ కామర్స్ (M.com), 4 మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (Msc), 13 మాస్టర్స్ ఆఫ్ లా, 12 మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫి (MPhil), 14 మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), 20 ప్రొఫెషనల్ కోర్సులు, 11 సర్టిఫికెట్ కోర్సులు, 9 పీజీ డిప్లమో కోర్సులతో పాటు ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అంలా వంటి కోర్సులు పూర్తి చేశారు. ప్రస్తుతం పార్థిబన్.. మేనేజ్మెంట్ అండ్ మాస్టర్స్ ఇన్ కార్పొరేట్ లా కోర్సులో PhD చేస్తున్నారు. అతని భార్య సెల్వకుమారికి కూడా చదువు పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఆమె 9 డిగ్రీలను పూర్తిచేశారు. పార్థిబన్ చేస్తున్న డిగ్రీలతో త్వరలోనే పలు రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story