- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం.. అతలాకుతలం అవుతున్న నగరం
ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాలు (Northeast monsoon) ప్రభావం తమిళనాడుపై అధికంగా కనిపిస్తుంది. నాలుగు రోజుల క్రితం దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఈశాన్య రుతుపవనాలు ప్రస్తుతం తమిళనాడు (Tamil Nadu), ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై నగరం (Chennai city)లో ఈశాన్య రుతుపవనాల కారణంగా గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో చెన్నై సహా తీరప్రాంత జిల్లాలు వర్షాల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
భారత వాతావరణశాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తూతుకుడి, నాగపట్నం వంటి జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీచేయబడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తమిళనాడు రాజధాని అయిన చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగిపోయాయి. ప్రధాన రోడ్లు, నివాస ప్రాంతాలు, డ్రైనేజ్ మార్గాలు నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర ట్రాఫిక్ వ్యవస్థ కూడా అంతరాయం కలిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రజల భద్రత కోసం అవసరమైన ఉపశమన శిబిరాలను సిద్ధం చేయమని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.






