చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-06 06:48:39  IST  )

పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.

చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కౌరి-బక్కల్ మధ్య నిర్మించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి (Chenab Railway Bridge)ని ఇవాళ ఆయన ప్రారంభించారు. ఆయన వెంట కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnav)తో పాటు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah)తో కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. చినాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రడ్జి నిర్మాణం జరిగింది. ఇందుకు రూ.1,486 కోట్లు ఖర్చు చేశారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో 3 గంటల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు జమ్మూ, శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది.

అదేవిధంగా కట్రాలో రూ.46 వేల కోట్లతో విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టును 272 కి.మీ మేర దాదాపు రూ.44 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. పూర్తిగా విద్యుదీకరించబడిన ఆ ప్రాజెక్టులో మొత్తం 36 టన్నెళ్లతో పాటు 943 వంతెనలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రధాని మోడీ శ్రీ మాతా వైష్ణో దేవి (Shri Mata Vaishno Devi) కొలువైన కట్రా నుంచి శ్రీనగర్‌కు, శ్రీనగర్ నుంచి కట్రాకు రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇక కట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Next Story