సూర్యనమస్కారం చేస్తున్న చిరుత.. వీడియో వైరల్

by Disha Web Desk 9 |
సూర్యనమస్కారం చేస్తున్న చిరుత.. వీడియో వైరల్
X

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా ఉదయం నిద్ర లేచాక వ్యక్తులే సూర్యనమస్కారాలు చేస్తారని తెలుసు. కానీ రష్యా ఫారెస్ట్‌లోని ‘ల్యాండ్ ఆఫ్ ది లెపార్డ్’ నేషనల్ పార్క్‌లో ఓ చిరుతపులి సూర్యనమస్కారం చేస్తూ కనిపించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ... తరచూ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో చిరుతపులికి సంబంధించిన ఒక మనోహరమైన వీడియోను సోమవారం తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో చిరుతపులి నిద్రలేచాక ర్మప్ చేయడం కనిపిస్తుంది. ఉదయాన్నే శరీరాన్ని సాగదీయడం.. కాళ్లమీద ముందుకు ఒంగి తల పైకెత్తి ఆ తరువాత వెనక కాళ్లను ముందు సాగదీసి బాడీని యాక్టివ్ చేసుకుంటుంది.

ఈ విధంగా పులి రోజు చేస్తుంది. కానీ ఆ వీడియోలో పులి సూర్యనమస్కారం చేస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ కనిపిస్తోంది. నందా ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి’’ అంటూ క్యాప్షన్‌ రాసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘ఈ యోగా మూవ్‌లను వారికి ఎవరు నేర్పిస్తారు యోగా టీచర్ లేడు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు’ అని సరదాగా రాశారు.

‘‘ఫిట్‌నెస్ ఫ్రీక్ చిరుతపులి’ అని మరొకరు అన్నారు. వ్యక్తి చిరుతపులి ‘ఫిట్‌నెస్ రహస్యం ఏంటి’, ‘వావ్ వాస్తవానికి ఇది అసలు సూర్య నమస్కారం’, ‘నన్ను చూస్తే.. నా కుక్కలు కూడా అలాగే చేస్తాయి’ అంటూ ఇలా వరసగా కామెంట్లు రాశారు. అడవి జంతువుల కదలికలను గమనించడానికి అమర్చిన రహస్య కెమెరా ద్వారా ఈ వీడియో రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోని మొదట్లో ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 124,000 కంటే ఎక్కువ వ్యూస్ రాగా.. 2,500 లైక్‌లు వచ్చాయి. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి మైక్రో- బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఆసక్తికరమైన వన్యప్రాణుల గురించి పంచుకోవడంలో చాలా పేరు పొందారు. గత వారం గుజరాత్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాన్ని కుక్కలు తరిమికొట్టిన వీడియో షేర్ చేశాడు.



Next Story

Most Viewed