- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chat GPT: మహిళ ప్రాణాలు కాపాడిన చాట్ జీపీటీ.. డాక్టర్లు గుర్తించని వ్యాధి కారణాన్ని క్షణాల్లో పట్టేసిన ఏఐ
మహిళ ప్రాణాలని చాట్ జీపీటీ కాపాడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కృత్రిమ మేధస్సు (ఏఐ) రోజు రోజుకు అద్భుతాలు సృష్టిస్తోంది. ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా వైద్యరంగంలో కొత్త పరిష్కారాలు చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన చాట్ జీపీటీ (Chat GPT) ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. ఆమె అనారోగ్యానికి కారణం ఏమిటో గర్తించడంలో వైద్యులు విఫలం కాగా చివరకు నిరాశతో ఓసారి చాట్ జీపీటీని అడిగి చూద్దామని ఆమె కూతురు చేసిన ప్రయత్నం ఫలించింది. కృత్రిమమేధ ఆ మహిళ సమస్యకు పరిష్కారం చూపిందిం. దీంతో తన తల్లిని చాట్ జీపీటీ కాపాడింది అంటూ శ్రేయ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
ఆ టాబ్లెట్ కారణంగానే అనారోగ్యం:
ఇంతకీ ఏం జరిగిందో శ్రేయ మాటల్లోనే.. ‘చాట్ జీపీటీ మా అమ్మను రక్షించింది (ChatGPT saved mom life).. ఏడాదిన్నర నుంచి మా అమ్మ నాన్ స్టాప్ దగ్గుతో బాధపడుతోంది. దాంతో మా అమ్మను అనేక పెద్ద పెద్ద ఆసుపత్రులు, అగ్రశ్రేణి వైద్యులకు చూపించాం. హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి ఇలా అన్ని ప్రయత్నించాం. కానీ రోజు రోజుకు మా అమ్మ పరిస్థితి మరింత దిగజారింది. అంతర్గత రక్తస్రావం కూడా ప్రారంభమైంది. మరో 6 నెలల పాటు ఇలాగే కొనసాగితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు తెలిపారు. దాంతో నాకు భయం వేసింది. ఇక నిరాశలో ఉన్న నేను చివరకు చాట్ జీపీటీని ట్రై చేశాను. నా తల్లి పరిస్థితిని అంతా చాట్ జీపీటికి వివరించారు. ఈ అనారోగ్యాగానికి చాట్ జీపీటీ నాకు చాలా కారణాలు చెప్పింది. అందులో బీపీ మందులు కూడా ఒకటి. అయితే ఈ బీపీ మెడిసన్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ చాట్ జీపీటీ అడగడంతో నేను మా అమ్మ బీపీ టాబ్లెట్ తీసుకుంటోందని చెప్పాను. అందుకు చాట్ జీపీటీ ఈ పదార్థాలతో బీపీ మందులు తీసుకుంటుందా అని అడిగింది. అందుకు నేను అవును అని సాధానం ఇవ్వగా మీ తల్లి అనారోగ్యానికి ఈ బీపీ మెడిసన్ కారణం కావొచ్చు అని సూచించింది. ఈ విషయం వెంటనే నేను వైద్యడికి చెప్పగా అతడు కూడా ధృవీకరించి మందులు మార్చినట్లు తెలిపారు. మందులు మార్చిన తర్వాత ఎట్టకేలకు తన తల్లి కోలుకుంటోంది. ఇది అతిశయోక్తి కాదు.. చాట్ జీపీటీ నా తల్లి ప్రాణాలను కాపాడిందంటూ శ్రేణ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇంత గొప్ప విషయాన్ని సృష్టించినందుకు మీకు ఎల్లప్పుడు కృతజ్ఞతలు అంటూ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్ కు ట్యాగ్ చేసింది.
కాగా, శ్రేయ ట్వీట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందర శ్రేయ తల్లి ప్రాణాలను కాపాడడంలో చాట్ జీపీటీ పాత్రను ప్రశంసించగా. మరికొందరు వైద్యులు తమ రోగ నిర్ధారణలో మరింత క్షుణ్ణంగా వ్యవహరించాల్సిందని కామెంట్స్ చేశారు. మరి కొంతమంది వినియోగదారులు చాట్ జీపీటీ సామర్థ్యాలు వైద్యులను ఉద్యోగం నుండి తొలగించవచ్చని ఫన్నీ కామెంట్స్ చేశారు.






