తీవ్ర గందరగోళం..పార్లమెంటులో ఘోరంగా కొట్టుకున్న నేత‌లు

by velandi.Saikiran |

తుర్కియే పార్లమెంటులో తాజాగా రసాభాస జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు కొట్టుకున్నారు.

తీవ్ర గందరగోళం..పార్లమెంటులో ఘోరంగా కొట్టుకున్న నేత‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రజా ప్రతి నిధులు అంటే అందరికీ రోల్ మోడల్ లాగా ఉండాలి. కానీ ఆ ప్రజా ప్రతినిధులే, అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. కమీషన్లు తీసుకోవడం, ఏ పని కావాలన్నా లంచం అడగడం లాంటివి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అలాగే పదవుల కోసం పార్టీలు మారడం కూడా జరుగుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే, అందులోకి జంప్ అవుతున్నారు. 24 గంటల్లోపే కండువా మార్చేస్తున్నారు. చొక్కా వేసుకున్నంత సులభంగా కండువా కూడా మార్చేస్తున్నారు. అయితే మరి కొంత మంది ప్రజా ప్రతినిధుల అన్న విషయం మర్చిపోయి దాడులు చేసుకునే వారు కూడా ఉంటారు. అలాంటి సంఘటన ఇప్పుడు తుర్కియేలో జరిగింది.

పార్లమెంట్లో ఘోరంగా కొట్టుకున్న నేతలు

తుర్కియే పార్లమెంటులో తాజాగా రసాభాస జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆ దేశ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ నియామకం పైన ఈ రగడ రాజుకుంది. సభ్యులు సభలో అరుస్తూ ఒకరిపై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించారు. అయినప్పటికీ దేశ న్యాయశాఖ మంత్రిగా అకిన్ గుర్లెక్ ప్రమాణస్వీకారం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటనలో ఓ సభ్యుడు తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తోంది. కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియామకమైన అకిన్ గుర్లెక్ గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇస్తాంబుల్ మేయర్ , ప్రతిపక్ష నేతలపై గ‌తంలో రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేశారని.. అకిన్ గుర్లెక్ పై ఆరోపణలు ఉన్నాయి. అందుకే అతని ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దాడికి దిగినట్లు తెలుస్తోంది.


Next Story